Singapore Govt: పిల్లలను కాపాడిన వలస కార్మికులను సత్కరించిన సింగపూర్ ప్రభుత్వం 4 d ago

ఏప్రిల్ 8న సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో సాహసం చేసి పిల్లలను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. భవనం మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించిన వారు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, 15 మంది పిల్లలను కాపాడారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. చిరంజీవి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు.